Raveena Tandon:తమ్ముడితో వస్తే బాయ్‌ఫ్రెండ్‌ అన్నారు..

సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా.. తారలపై వచ్చే గాసిప్స్‌ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా మారుతుంటాయి. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సినీతారలపై నెట్టింట్లో అనేక గాసిప్స్‌ వస్తుంటాయి. ఈ తరం తారలు వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ, 90ల్లో సినిమా మ్యాగజీన్లు

Published : 05 Jan 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమలో తారలపై వచ్చే గాసిప్స్‌ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా మారుతుంటాయి. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సినీతారలపై నెట్టింట్లో అనేక గాసిప్స్‌ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ తరం తారలు వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ, 90ల్లో సినిమా సంచికలు విడుదలయ్యాయంటే భయంతో వణికిపోయేవారట నటి రవీనా టాండన్‌. తనపై విపరీతమైన గాసిప్స్‌ పుట్టుకొచ్చేవని, అప్పటి సినిమా విలేకరులు దారుణంగా తమపై వార్తలు రాసేవారని గతాన్ని గుర్తు చేసుకుంది. ఒకానొక సమయంలో తన సోదరుడినే బాయ్‌ఫ్రెండ్‌గా మార్చేశారని వాపోయింది.

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రవీనా.. ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ‘అరణ్యక్‌’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో తనపై వచ్చిన గాసిప్స్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘‘ఈ గాసిప్స్‌ వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఎంతగానో ఏడ్చాను. ప్రతి నెలా సినిమా మ్యాగజైన్లు విడుదలవుతున్నాయంటే భయం పట్టుకునేది. గాసిప్స్‌ ప్రచురించే కొన్ని మ్యాగజైన్లు నాకున్న పేరును, విలువను నాశనం చేశాయి. నేను, నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం. ఓ సంస్థ ఏకంగా నా సోదరుడిని నా బాయ్‌ఫ్రెండ్‌ అని రాసుకొచ్చింది. ‘ఓ అందమైన యువకుడు రవీనా టాండన్‌ను సెట్స్‌ వద్ద డ్రాప్‌ చేయడానికి వస్తున్నాడు. ఆయన రవీనా బాయ్‌ఫ్రెండ్‌ అట’’అని ఆ మ్యాగజైన్‌ పేర్కొంది. ఆ విషయంపై ఎవరు స్పష్టత ఇవ్వాలి? ఎంత అని ఇవ్వాలి? సినీ పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది’’అని రవీనా చెప్పుకొచ్చింది. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని