బల్వీర్‌ జానపదం.. స్నానం తెచ్చిన తిప్పలు

మరోవైపు చాలాకాలం తర్వాత బల్‌వీర్‌సింగ్‌ పాటపాడి అదరగొట్టాడు. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా జానపదం గేయంతో అందర్నీ ఉర్రూతలూగించాడు. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌, నూకరాజు, నరేశ్‌ కలిసి అదిరిపోయే స్కిట్‌తో నవ్వులు పూయించారు.

Published : 27 Jun 2021 22:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత బల్‌వీర్‌సింగ్‌ పాటపాడి అదరగొట్టాడు. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా జానపదం గేయంతో అందర్నీ ఉర్రూతలూగించాడు. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌, నూకరాజు, నరేశ్‌ కలిసి అదిరిపోయే స్కిట్‌తో నవ్వులు పూయించారు. పసిపిల్లలకు స్నానం పోసే విధానాల్లో అప్పటికీ.. ఇప్పటికీ వచ్చిన మార్పులను స్కిట్‌ రూపంలో ప్రదర్శించారు. నరేశ్‌ పసిపిల్లాడిలా.. ఆ పిల్లాడికి స్నానం చేయించే తల్లి పాత్రలో నూకరాజు, ఇమ్మాన్యుయెల్‌ కనిపించారు. ఆ రెండు వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆలస్యం ఎందుకు చూసి నవ్వుకోండి మరి!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు