Updated : 31/10/2021 18:20 IST

Bigg Boss Telugu 5: ప్రియాంక నువ్వు ఎలిమినేట్.. ‘బిగ్‌బాస్‌’లో విజయ్‌ దేవరకొండ హంగామా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌లో యువ నటుడు విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసి హౌజ్‌మేట్స్‌ని అలరించారు. దీపావళి పండగ సంబరాల్లో భాగంగా కొందరు సినీ తారల్ని ‘బిగ్‌బాస్‌’ ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్‌తోపాటు నాయికలు శ్రియ, అవికా గోర్‌, బుల్లితెర వ్యాఖ్యాత సుమ, గాయని, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ కల్పన  ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌లో అడుగుపెట్టారు. దీపావళి శోభని ముందుగానే తీసుకొచ్చారు. డ్యాన్స్‌, పాటలతో మాంచి వినోదం పంచారు.

ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులంతా రెండు బృందాలుగా ఏర్పడి, క్విజ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ‘పౌరాణిక చిత్రాల పేర్లు చెప్పండి’ అని నాగార్జున అడగ్గా ‘మహాభారతం, రామాయణం, కృష్ణార్జున యుద్ధం, అర్జున్‌ రెడ్డి’ అని ప్రియాంక సమాధానమిచ్చింది. ‘అర్జున్‌ రెడ్డా..! అయిపోయింది.. నువ్వు ఎలిమినేటేడ్‌’ అంటూ ప్రియాంకని ఓ ఆట ఆడుకున్నాడు విజయ్‌ దేవరకొండ. షణ్ముఖ్‌ను ఉద్దేశించి గాయని కల్పన ఆలపించిన ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘స్వీటీ’ పేరడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమ తన మాటల పటాసులు పేల్చింది. ఈ అల్లరితోపాటు ఇంకా ఏఏ విశేషాలు ఉన్నాయి? తెలియాలంటే కొన్ని క్షణాలు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోలు చూసి ఆనందించండి..





Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని