Bigg Boss Telugu5: నేను ఏం చేయాలో నువ్వే చెబుతావా? అది నా ఇష్టం శ్రీరామ్‌..!

‘బిగ్‌బాస్‌ తెలుగు 5’ ప్రోమో.. కన్నీటి పర్యంతమైన ప్రియాంక అలియాస్‌ సాయి తేజ్‌....

Updated : 07 Oct 2021 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవ్వులు, డ్యాన్సులు, పాటలు, గొడవలతో ప్రతి రోజూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే ‘బిగ్‌బాస్‌’ షోలో హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. తన తండ్రి మాటలు విన్న ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. తాను అమ్మాయిగా మారినా తల్లిదండ్రులు ఏం ఫర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా మాకు ఓకే అనడంతో భావోద్వేగానికి గురైంది. ప్రియాంక పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి వీడియో కాల్‌ ద్వారా తన మనసులో మాట పంచుకున్నారు. ఈ రోజు ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా హౌస్‌మేట్స్‌ అంతా కలిసి ఆమెకి పువ్వులు, గాజులు, చీరని కానుకగా అందించారు. ‘నాన్నా సాయితేజ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు సర్వం నువ్వే. అమ్మాయిగా మారావని నిన్ను ఆదరించటం మానేస్తామా. ఎప్పుడూ, అలా అనుకోవద్దు’ అని తన తండ్రి ఇచ్చిన భరోసాకి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది ప్రియాంక. ‘నా సొంత ఇంటికి కూడా నేను దొంగలా వెళ్తా. నేనొచ్చానని మా పక్కింటి వారికీ తెలియదు. ఈ రోజు మా నాన్న నన్ను అంగీకరించి నువ్వు ఇంటికి రావొచ్చు అంటే ఏదో తెలియని ఫీలింగ్‌. మా నాన్నని పట్టుకుని గట్టిగా ఏడవాలని ఉంది ’ అని చెబుతూ హృదయాలను బరువెక్కించింది. ఇక కెప్టెన్‌ కంటెండర్‌ను ఎంపిక చేసే విషయమై ఇంటి సభ్యుల మధ్య పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ శ్రీరామ్‌, హమీదలను ఎంచుకోకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను ఏం చేయాలో నువ్వే చెబుతావా’ అని సన్నీని శ్రీరామ్‌ ప్రశ్నించగా, ‘అది నా ఇష్టం’ శ్రీరామ్‌ అని సన్నీ బదులిచ్చాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని