Bigg Boss Telugu 5: నేను డ్రామా క్వీన్‌ కాదు.. నా చేతుల్లో గేమ్‌ ఉంది ఆడతా!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 5వ...

Updated : 12 Oct 2021 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్‌ ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వంతో వేడెక్కిన హౌస్‌లో ఈ రోజు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ విశేషాలు చెప్పేందుకే ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్‌గా సాగింది. ‘హమీదాతో రెండు పాయింట్లే అని నేను సైగ చేసి చెప్తే.. తను నువ్వు చెప్పి చావు’ అందని సన్నీ కామెడీ పండించాడు. ‘బ్రేకప్‌ బ్రో.. బ్రదర్‌, సిస్టర్‌ల బ్రేకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాజల్‌ తన మనసులో మాట తెలిపింది. ‘గేమ్‌ అంటే ఏంటి? ఇది గేమా. ఇది కరెక్ట్‌ కాదు’ అని శ్వేత తన కోపాన్ని ప్రదర్శించింది. ‘ఐన్‌స్టీన్‌ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నమైనా చేయొచ్చేమో కానీ వీళ్ల నామినేషన్లని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేం. అవి అర్థంకావు’ అని షణ్ముఖ్‌, జెస్సీ మాట్లాడుకున్నారు. మరి కాజల్‌ ఎందుకు బ్రేకప్‌ చెప్పింది? శ్వేత ఎవరిపై అంతలా ఫైర్‌ అయింది? తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే...



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని