Cash Promo: ఆర్జీవీకు అరియానా కాల్‌.. ఆన్సర్‌కు షాకైన ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌లు!

‘క్యాష్‌’ లేటెస్ట్‌ ప్రోమో. సుమతో ‘బిగ్‌బాస్‌’ ఫేం అరియానా, అషురెడ్డి, రాహుల్‌ సిప్లిగంజ్‌ సందడి...

Published : 17 Nov 2021 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌ 3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌, కంటెస్టెంట్‌ అషురెడ్డి, ‘బిగ్‌బాస్‌ 4’ ఫేం అరియానా, కుమార్‌ సాయి ‘క్యాష్‌’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఇది. ‘ఈటీవీ’ వేదికగా ప్రతి శనివారం రాత్రి 9:30 ని.లకు ప్రసారమవుతుంది. ఈనెల 20న ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ అతిథుల మాటలకు కౌంటర్‌ వేస్తూ సుమ ఆద్యంతం అలరించారు. ‘సుమ కాకా హోటల్’ అనే స్కిట్‌తో హాయిగా నవ్వించారు. ఇందులో కుమార్‌ సాయి చెఫ్‌గా మారతాడు.

ఈ క్రమంలో ‘నాకు పెద్ద దోశ కావాలి’ అని అషురెడ్డి అడగ్గా ‘చిన్న దోశను సాగదీసుకో’ అంటూ సుమ నవ్వుల్లో ముంచెత్తింది. ‘నాకు ఎగ్‌దోశ కావాలి’ అని అరియానా కోరగా ‘వెళ్లి కోడిని అడుగు. దానికి కొంచెం దోశపిండి పెడితే ఎగ్‌తోపాటు దోశని కలిపివేస్తుంది’ అంటూ నాన్‌స్టాప్‌ గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత.. అరియానా, అషురెడ్డి.. ఈ ఇద్దరిలో ‘ఎక్స్‌ట్రా బోల్డ్‌’ ఎవరో తెలుసుకునేందుకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ)కు ఫోన్‌ చేయమని సుమ అదేశించగా అరియానా కాల్‌ చేసింది. ఆయన మాటలకు సుమతోపాటు షోలో ఉన్నవారంతా షాక్‌ అయ్యారు. మరి ఆర్జీవీ ఏం మాట్లాడారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని