Dhee 13 Promo: హోరాహోరీగా డ్యాన్స్ పోరు.. ‘ఢీ’లో మెరిసిన మంచు లక్ష్మి
‘ఢీ 13’ లేటెస్ట్ ప్రోమో. మంచు లక్ష్మి అతిథిగా విచ్చేసి సందడి చేశారు. సెమీ ఫెనల్స్లో ఎవరెలా పెర్ఫామెన్స్ చేశారో చూసేయండి....
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో ‘ఢీ’. ప్రస్తుతం ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ పేరుతో 13వ సీజన్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. గత సీజన్లలానే ఈ సీజనూ ప్రతిభావంతులైన కంటెస్టెంట్లను పరిచయం చేసింది. వారిలో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. సెమీ ఫైనల్స్-2కి చేరుకున్న ఈ షోకు మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతోపాటు యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ (గుంటూరు టాకీస్ ఫేం) విచ్చేసి సందడి చేశారు. సిద్ధు, రష్మి, సుధీర్‌తో ఆది చేయించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటెస్టెంట్లంతా తమ నృత్యంతో కట్టిపడేశారు. ‘మగువా మగువా’ పాట ప్రదర్శన పూర్తయిన తర్వాత కంటెస్టెంట్ నైనిక భావోద్వేగానికి గురైంది. రష్మి తనకు స్ఫూర్తి అని తెలిపింది. నైనిక ఎందుకలా ఫీలైంది? మంచు లక్ష్మికి ఎవరి పెర్ఫామెన్స్ నచ్చింది? తెలియాలంటే నవంబరు 24న వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ప్రోమో చూసి ఆనందించండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్‌ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్‌లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్‌లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్‌చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.