6 నిమిషాలు...33 వాయిస్‌లు..

వినోదాన్ని అందించడంతోపాటు కొత్త ప్రతిభని పరిచయం చేస్తుంటుంది ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం. జులై 18న (ఆదివారం) 25వ ఎపిసోడ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇమిటేషన్‌ రాజు ఈ షోకి విచ్చేసి, తనలోని అసామాన్య ప్రతిభని తెలుగు ప్రేక్షకులకి చూపించారు.

Published : 20 Jul 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదాన్ని అందించడంతోపాటు కొత్త ప్రతిభని పరిచయం చేస్తుంటుంది ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం. అలా ఈసారి ఇమిటేషన్‌ రాజుని మనముందుకు తీసుకొచ్చింది. జులై 18న (ఆదివారం) 25వ ఎపిసోడ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇమిటేషన్‌ రాజు ఈ షోకి విచ్చేసి, తనలోని అసామాన్య ప్రతిభని తెలుగు ప్రేక్షకులకి చూపించారు. ఇప్పటికే వివిధ వేదికలపై ఇమిటేషన్‌ చేసిన రాజు తొలిసారిగా ఈ కార్యక్రమంలో స్పాట్‌ డబ్బింగ్‌ చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. సుమారు 6 నిమిషాల వ్యవధిలో వివిధ భావోద్వేగాలతో కూడిన 33 మంది నటుల వాయిస్‌ని వినిపించి అలరించారు. సాయి కుమార్‌, బాలకృష్ణ, రావు గోపాలరావు, మోహన్‌ బాబు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సుధాకర్‌,  శ్రీహరి, నాగార్జున, ప్రభాస్‌, రాళ్లపల్లి, కమల హాసన్‌, పోసాని కృష్ణమురళి, జీవా, నాగేశ్వరరావు, కైకాల సత్యనారాయణ.. తదితర నటుల సంభాషణలు స్ర్కీన్‌పై వస్తుంటే దానికి తగ్గినట్టుగా నాన్‌స్టాప్‌ స్పాట్‌ డబ్బింగ్ చెప్పి షోలో పాల్గొన్న వాళ్లని, ఈ షో చూసిన వాళ్లనీ ఫిదా చేశారు. రాజు ప్రదర్శన ముగిసిన తర్వాత జితేంద్ర అనే వ్యక్తి తనదైన శైలిలో నటుల్ని ఇమిటేట్‌ చేసి ఆకట్టుకున్నారు. నటీమణులు ఇంద్రజ, లైలా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సుధీర్‌, ఆది, రామ్‌ ప్రసాద్‌ ఎప్పటిలానే తమ పంచ్‌లు విసురుతూ కామెడీ పండించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ హంగామా మీరూ చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని