Updated : 28/10/2021 09:44 IST

Seetimaarr: గోపీచంద్‌, తమన్నా మాస్‌ బీట్‌.. ‘జ్వాలారెడ్డి’ ఫుల్‌ వీడియో వచ్చేసింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించిన గీతాల్లో ‘జ్వాలారెడ్డి’ ఒకటి. ఈ పాట లిరికల్‌ వీడియో విడుదలైన రోజు నుంచే యూట్యూబ్‌లో విశేష స్పందన లభించింది. మాస్‌ బీట్‌ కావడం, గోపీచంద్‌, తమన్నా కెమిస్ట్రీ అద్భుతంగా పండటమే ఇందుకు కారణం. ఫుల్‌ వీడియో ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకి చిత్ర బృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్‌ అందించింది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. శంకర్‌ బాబు, మంగ్లీ ఆలపించారు.

కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదలై మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ వేదికగా అలరిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్‌ (కార్తీక్‌), తమన్నా (జ్వాలారెడ్డి) కబడ్డీ కోచ్‌లుగా నటించారు. భూమిక, దిగంగన సూర్యవంశీ, పోసాని తదితరులు కీలక పాత్రలు షోషించారు. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని