Pelli SandaD: బుల్లితెరపై ‘పెళ్లి సందడి’.. సన్యాసం తీసుకోవాలనిపిస్తోందన్న కీరవాణి!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘పెళ్లి సందడి’.ఇప్పుడు ‘పెళ్లి సందD’ పేరుతో  శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఆ సందడి చేయబోతున్నారు.

Published : 08 Oct 2021 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘పెళ్లి సందడి’. ఇప్పుడు ‘పెళ్లి సందD’ పేరుతో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ అలాంటి సందడే చేయబోతున్నారు. రోషన్‌, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రమిది. గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, హేమ, ఝాన్సీ తదితరలు కీలక పాత్రలు పోషించారు. తమ హంగామా ఎలా ఉంటుందో సినిమా విడుదలకి ముందే వీరంతా చూపించారు. ఎక్కడ అంటారా? మీ అభిమాన ఛానల్‌ ఈటీవీ వేదికగా. ‘రాఘవేంద్రుD పెళ్లి సందD’ పేరుతో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో రాఘవేంద్రరావు, కీరవాణి, గౌరి, రోషన్‌, శ్రీలీల, తనికెళ్ల భరణి, హేమ తదితరులు పాల్గొని, తమదైన శైలిలో అలరించారు. ‘మీ అందరినీ చూస్తుంటే అర్జెంట్‌గా వెళ్లి సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది’ అని కీరవాణి అనడంతో నవ్వులు విరబూశాయి. సుమ, కీరవాణి వ్యాఖ్యాతలుగా వ్యహరించిన ఈ ప్రోగ్రామ్‌ త్వరలోనే ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని