KBC: రూ. 7 కోట్లు అతడు గెలుస్తాడా?

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతపొందిన టీవీ షోల్లో ‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి’ ఒకటి. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ప్రస్తుతం 13వ సీజన్‌ ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే.

Published : 19 Oct 2021 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టీవీ షోల్లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఒకటి. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ప్రస్తుతం 13వ సీజన్‌ ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో రూ. కోటి సొంతం చేసుకున్న తొలి కంటెస్టెంట్‌గా హిమానీ బుందేలా నిలిచారు. కళ్లు సరిగా కనిపించకపోయినా విజేతగా మారి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు మరో కంటెస్టెంట్‌ కరోడ్‌పతి అయ్యారు. అయితే, ఆయన రూ. కోటితో ఆగిపోలేదు. రూ. 7 కోట్ల ప్రశ్నకి చేరువయ్యారు. ఈ ఉత్కంఠభరిత ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో.. హాట్‌సీట్‌లో ఉన్న అమితాబ్‌ రూ.కోటి ప్రశ్న అడగ్గా సదరు కంటెస్టెంట్‌ ఆప్షన్‌ ‘డి‘ని ఎంపిచేసుకున్నారు. అది సరైన సమాధానమా, కాదా? అనే ఉత్కంఠకి తెరదించుతూ అమితాబ్‌ ‘ఏక్‌ కరోడ్‌’ అని ఖరారు చేశారు. దాంతో షో హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ తర్వాత ‘ఆట ఇంకా పూర్తవలేదు’ అంటూ రూ. 7 కోట్ల ప్రశ్నని సంధించారు అమితాబ్‌. మరి ఆ కంటెస్టెంట్‌ రూ.7 కోట్లు గెలుస్తాడా, లేదా? అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అక్టోబరు 20, 21 తేదీల్లో ఈ ఎపిసోడ్‌ ప్రసారంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని