Sridevi Drama Company: సుడిగాలి సుధీర్‌ ఆనాటి ఫొటో చూశారా..!

మేజిషియన్‌గా కెరీర్‌ ఆరంభించి.. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని వ్యాఖ్యాతగా రాణిస్తున్న నటుడు సుడిగాలి సుధీర్‌. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ప్రతి ఆదివారం సాయంత్రం....

Published : 02 Aug 2021 23:34 IST

హైదరాబాద్‌: ఇంద్రజాలికుడిగా కెరీర్‌ ఆరంభించి.. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని వ్యాఖ్యాతగా రాణిస్తున్న నటుడు సుడిగాలి సుధీర్‌. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ప్రతి ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో తాజాగా ఫ్రెండ్‌షిప్‌ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ‘స్నేహమేరా జీవితం’ అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెండితెర హాస్యనటులు ప్రియదర్శి, అభినవ్‌ సందడి చేశారు.

షోలో భాగంగా ‘జబర్దస్త్‌’ కమెడియన్స్ అందరి పాత ఫొటోలతో స్లైడ్‌ షో సిద్ధం చేసి వారందరికీ ఆనాటి మధుర జ్ఞాపకాలు గుర్తుచేశారు. గెటప్‌ శీను, ఆటో రాంప్రసాద్‌, సన్నీ, రోహిణి, ఆదిల ఫొటోలు చూసి అందరూ సరదాగా నవ్వుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తన స్నేహితుడితో కలిసి సుధీర్‌ దిగిన ఓ ఫొటోని ఇందులో చూపించారు. ఆ ఫొటో చూసిన అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. బక్కపల్చని రూపంలో ఉన్న సుధీర్‌ ఫొటోని చూసి.. ‘అన్నా అది నువ్వేనా.. నిజంగా నేను ఆవేశం సర్‌’ అనుకున్నాను అంటూ ప్రసాద్‌ వేసిన పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘జబర్దస్త్‌’ కమెడియన్స్ స్పెషల్‌ ఫొటోలు మీరూ చూసేయండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని