Published : 22/09/2021 00:23 IST

Sridevi Drama Company: హావభావాల అంత్యాక్షరి.. నవ్వులే నవ్వులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హావభావాలతో అంత్యాక్షరి ఆడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అసలు ఇలాంటి వినూత్న అంత్యాక్షరి ఉంటుందా అనుకుంటున్నారా? అవును.. అంటే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం చూడాల్సిందే. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ఇది. బుల్లితెర ప్రేక్షకులకి ప్రతి ఆదివారం వినోదం పంచుతుంటుంది. సెప్టెంబరు 26న ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలై, సందడి చేస్తోంది. ఇందులో ఆది, హిమజ భార్యాభర్తలుగా కనిపించి నవ్వులు పూయిస్తున్నారు. ‘జబర్దస్త్‌’ నటులు రెండు బృందాలుగా ఏర్పడి అంత్యాక్షరి ఆడిన తీరు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. సాధారణంగా ఆడే అంత్యాక్షరిలా కాకుండా ఒక్కక్కరు ఒక్కో విధమైన ఎక్స్‌ప్రెషన్‌తో పాటని ప్రారంభించి విశేషంగా అలరించారు. అనంతరం విష్ణుప్రియ చేసిన డ్యాన్స్‌ వావ్‌ అనిపించేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ హంగామాని చూసేయండి... సరికొత్త అంత్యాక్షరిని చూసి ఎంజాయ్‌ చేయండి...


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని