పాత రోజుల్లోకి తీసుకెళ్లిన సదా

‘రానురానంటూనే చిన్నదో’ అంటూ జయం సినిమాలో సదా చేసిన అల్లరి గుర్తుందిగా..! దాదాపు ఇరవయేళ్ల తర్వాత మళ్లీ పాత రోజులను గుర్తు చేసిందామె. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఆమె కనిపించి సందడి చేసింది. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన పాటకు మళ్లీ ఓసారి స్టెప్పులేసింది.

Updated : 17 Aug 2022 11:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రానురానంటూనే చిన్నదో’ అంటూ జయం సినిమాలో సదా చేసిన అల్లరి గుర్తుందిగా..! దాదాపు ఇరవయేళ్ల తర్వాత మళ్లీ ఓసారి పాత రోజుల్లోకి తీసుకెళ్లిందామె. ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా రాబోయే ఎపిసోడ్‌లో ఆమె సందడి చేయనుంది. తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన పాటకు సదా మళ్లీ ఓసారి స్టెప్పులేసింది. మరోనటి ఇంద్రజ గాయని అవతారం ఎత్తింది. ‘లాలి.. లాలి’ అంటూ పాట పాడి అందర్నీ ఆకట్టుకుంది. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన ‘ఇందువదన’ చిత్రబృందం కూడా పాల్గొని సందడి చేసింది. ఎప్పటిలాగే రామ్‌ప్రసాద్‌, ఆది తమదైన స్టైల్‌లో పంచ్‌లు వేసి కడుపుబ్బా నవ్వించారు. భాను, వర్ష, ఇమ్మాన్యుయెల్‌ తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్సుతో అదరగొట్టారు. ఈపూర్తి ఎపిసోడ్‌ జూలై 25న మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. చూసి ఆనందించండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు