Shreya Ghoshal: ఆ ట్వీట్స్‌ చేసినప్పుడు మేం చిన్నపిల్లలం

ట్విటర్‌ కొత్త సీఈవోగా ముంబయికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులైనప్పటి నుంచి ఆయనతో పాటు సమానంగా వార్తల్లో నిలిచారు ప్రముఖ గాయని శ్రేయాఘోషల్‌. పరాగ్‌, శ్రేయ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. కలిసి చదువుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌ సీఈవోగా తన బాల్యస్నేహితుడు పరాగ్‌ నియమితులవ్వడంతో శుభాకాంక్షలు తెలియజేశారామె. 

Published : 02 Dec 2021 01:39 IST

ట్విటర్‌ కొత్త సీఈవో పరాగ్‌- గాయని శ్రేయాఘోషల్‌ 2010లో చేసిన ట్వీట్స్‌ వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొత్త సీఈవోగా ముంబయికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులైనప్పటి నుంచి ఆయనతో పాటు సమానంగా వార్తల్లో నిలిచారు ప్రముఖ గాయని శ్రేయాఘోషల్‌. పరాగ్‌, శ్రేయ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. కలిసి చదువుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌ సీఈవోగా తన బాల్యస్నేహితుడు పరాగ్‌ బాధ్యతలు చేపట్టడంతో శుభాకాంక్షలు తెలియజేశారామె. ‘‘ కంగ్రాట్స్‌ పరాగ్‌! నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మా అందరికీ ఇది చాలా గొప్పరోజు. ఈ వార్త విన్నాక పండగలా జరుపుకొంటున్నాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే గతంలో వీరిద్దరూ చేసిన ట్వీట్స్‌ వైరల్‌గా మారాయి. 2010లో పరాగ్‌ గురించి ట్వీట్‌ చేశారు శ్రేయా. ‘‘ హాయ్‌ అందరికీ! ఇతడి పేరు పరాగ్‌. నా బాల్య స్నేహితుడు, స్టాన్‌ఫోర్డ్‌ స్కాలర్‌, ఫుడీ, ట్రావెలర్‌. నిన్న అతడి పుట్టినరోజు అందరూ విష్‌ చేయండి. ఫాలో చేయండి’’ అని శ్రేయ ట్వీట్‌ చేయగా.. ‘‘ శ్రేయా! నువ్వు పెట్టిన ఆ ఒక్క ట్వీట్‌కి నీ ఫాలోవర్స్‌ మెసేజెస్‌తో నా ట్విటర్‌ అంతా నిండిపోయింది.’’ అని పరాగ్‌ బదులిచ్చారు. రెండురోజులుగా 11 ఏళ్ల క్రితం వీరిద్దరు జరిపిన  సంభాషణ కాస్త వైరల్‌ అవ్వడంతో నవ్వుతూ స్పందించారు శ్రేయా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని