‘వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను’

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం సమసిసోయింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అయితే తనతో పూర్తిగా విభేదించి పార్టీని వదిలి వెళ్లన తన విరోధి సచిన్‌పైలట్‌తో అధిష్ఠానం సయోధ్య

Published : 11 Aug 2020 17:05 IST

సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలపై అశోక్‌ గహ్లోత్‌

జైపుర్‌ : రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం సమసిసోయింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అయితే తనతో పూర్తిగా విభేదించి పార్టీని వదిలి వెళ్లన తన విరోధి సచిన్‌పైలట్‌తో అధిష్ఠానం సయోధ్య కుదుర్చకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు.

‘తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఏ ఎమ్మెల్యే అయినా నాపై కోపంగా ఉంటే.. వారి సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. నేను గతంలో ఇలానే చేశాను.. ఇప్పుడూ చేస్తాను’ అని గహ్లోత్‌ అన్నారు. 

‘కాంగ్రెస్‌లో శాంతి, సోదరభావం ఎప్పుడూ అలాగే ఉంటుంది. పార్టీలో సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా తన వంతు ప్రయత్నం చేసింది. కానీ చివరికి..మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారు.. ఒక్కరు కూడా మమ్మల్ని విడిచి పెట్టలేదు’ అని భాజపాపై విమర్శలు గుప్పించారు.

రాజస్థాన్‌లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ.. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ వేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని