Published : 26/07/2020 14:35 IST

రాజస్థాన్‌: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!

జులై 31న సమావేశపరచాలన్న సీఏం గహ్లోత్‌
సరైన కారణంతో గవర్నర్ ముందుకు మరోసారి..?

జైపూర్‌: రాష్ట్రంలో అసెంబ్లీని సమావేశపరిచి తన బలాన్ని ప్రదర్శించుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన నోట్‌లో సరైన తేదీ, కారణాలు లేవంటూ గవర్నర్‌ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా బలనిరూపణ వంటి కారణాలు పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటుచేయాలనే కారణాలతో గవర్నర్‌ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎలాగైనా అసెంబ్లీని సమావేశపరచాలనే వ్యూహాన్ని ముఖ్యమంత్రి గహ్లోత్‌ రచిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ మరోసారి విమర్శించింది. అసెంబ్లీ సమావేశాలకు పిలవాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనను గవర్నర్‌ పట్టించుకోవడం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ అవినాష్‌ పాండే ఆరోపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైతే ప్రధాని నివాసం వెలుపల అయినా ధర్నా చేద్దామని తన ఎమ్మెల్యేలకు సూచించారు. పరిస్థితులు కుదుటపడేవరకు హోటల్‌లోనే ఉండాలని ముఖ్యమంత్రి గహ్లోత్‌ ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్