కాంగ్రెస్‌లోనే సచిన్‌ పైలట్‌!

రాజస్థాన్‌లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది.

Updated : 11 Aug 2020 13:25 IST

నెల రోజుల రాజకీయ ప్రతిష్టంభనకు తెర..
సోనియా, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపిన సచిన్‌

జైపుర్‌: రాజస్థాన్‌లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ వేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన  సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నేను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా మెరుగైన భారత్‌ కోసం పనిచేస్తాను. రాజస్థాన్‌ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాపాడుకోవడంతోపాటు ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి కృషి చేస్తాను’ అని సచిన్‌ పైలట్‌ ట్విటర్‌లో ప్రకటించారు. సొంత ప్రయాజనాలు లేవని.. కేవలం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే సమస్యలను లేవనెత్తనట్లు సచిన్‌ స్పష్టం చేశారు. 

సచిన్‌ పైలట్‌ వర్గం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.సీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈసమయంలో పార్టీ నిర్ణయాన్ని సచిన్‌ పైలట్‌ స్వాగతించారు. అయితే సచిన్‌ పైలట్‌, రాహుల్‌ గాంధీల మధ్య జరిగిన చర్చల సారాంశం మాత్రం బయటకు రాలేదు.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై అసమ్మతి స్వరం వినిపిస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

స్పందించిన కపిల్‌ సిబాల్‌..
రాజస్థాన్‌లో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ స్పందించారు. ఆగస్టు 14కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. సచిన్‌ పైలట్‌కు భరోసా లభించింది. భాజపా మాత్రం నేలకొరిగింది. అవకాశవాదం సురక్షితమైంది కాదు అని తనదైన శైలిలో భాజపాకు చురుకలంటించారు.

ఇవీ చదవండి..
రాజీ’స్థాన్‌: పైలట్‌ ల్యాండింగ్‌కు కారణమిదేనా..?
సచిన్‌ పైలట్‌కు ఉద్వాసన!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని