సచిన్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి సచిన్‌ పైలట్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.......

Published : 12 Nov 2020 21:16 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి సచిన్‌ పైలట్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సలహాలు తీసుకొని తగిన సూచనలు పాటిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో సచిన్‌ పైలట్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన త్వరగా కోలుకోవాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ట్విటర్‌లో ఆకాంక్షించారు. 

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 883 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,951కి చేరగా.. మరణాల సంఖ్య 3055కి పెరిగాయి. కరోనా బారిన పడినవారిలో 1,68,568మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 8328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని