భాజపాలో చేరితే కేంద్ర మంత్రి పదవిస్తామన్నారు
పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆదివారం పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. భాజపాపై విమర్శలు గుప్పించారు.
ఆప్ ఎంపీ భగవంత్ మాన్ ఆరోపణలు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆదివారం పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. భాజపాపై విమర్శలు గుప్పించారు. ఆప్‌ను వదిలేసి తమ పార్టీలోకి చేరమని భాజపాకు చెందిన ఓ సీనియర్ నేత తనకు నాలుగు రోజుల క్రితం ఫోన్ చేశారని చెప్పారు. భారీగా నగదుతో పాటు.. కేంద్ర మంత్రిమండలిలోనూ చోటు కల్పిస్తామని ఆ నేత హామీ ఇచ్చారని ప్రకటించారు. ‘‘మాన్ సాబ్.. భాజపాలో చేరడానికి ఎంత తీసుకుంటారు. మీకు డబ్బు కావాలా’’ అని ఆ నేత తనను అడిగినట్లు మాన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తనను డబ్బుతో కొనలేరని, తానొక మిషన్ మీద రాజకీయాల్లోకి వచ్చానని కమిషన్ కోసం రాలేదని.. ఆ విషయాన్ని భాజపా నేతకు స్పష్టం చేసినట్లు భగవంత్ మాన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్