Navjot Singh Sidhu: సీఎంతో భేటీ కానున్న సిద్ధూ.. రాజీనామాపై వెనక్కి తగ్గేనా?

సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి పార్టీలో

Published : 30 Sep 2021 12:37 IST

చండీగఢ్‌: సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి పార్టీలో అలజడి సృష్టించారు నవజోత్ సింగ్‌ సిద్ధూ. ఆయన రాజీనామాను కాంగ్రెస్‌ ఇంకా ఆమోదించలేదు. అయితే సిద్ధూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో సిద్ధూ భేటీ కానున్నారు. 

ఈ విషయాన్ని సిద్ధూ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించడం విశేషం. ‘‘చర్చల కోసం సీఎం నన్ను ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు చండీగఢ్‌లోని పంజాబ్‌ భవన్‌లో మేం భేటీ కానున్నాం. ఎలాంటి చర్చలకైనా ఆయన్ను స్వాగతిస్తున్నా’’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. సీఎం చన్నీ బుధవారం సిద్ధూతో ఫోన్లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం కోరగా.. అందుకు సిద్ధూ అంగీకరించారు. 

ఇదిలా ఉండగా.. రాజీనామాపై సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూనే కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని సదరు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జరగబోయే సిద్ధూ-చన్నీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు