Rahul Gandhi: క్షమాపణ ఎందుకు చెప్పాలి?: రాహుల్‌ గాంధీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్‌ సహా 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఎంపీలపై శీతకాల సమావేశాలు

Published : 01 Dec 2021 01:28 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్‌ సహా 12 మంది విపక్ష ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఎంపీలపై శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. అయితే, దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ఈ 12 మంది ఎంపీలు సభకు, ఛైర్మన్‌కు క్షమాపణ చెబితే.. సస్పెన్షన్‌పై ప్రభుత్వం పునరాలోచిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. క్షమాపణ చెప్పేదే లేదని స్పష్టం చేశారు. ‘క్షమాపణ ఎందుకు చెప్పాలి? పార్లమెంట్‌లో ప్రజల సమస్యలను లేవనెత్తినందుకా? క్షమాపణ చెప్పేదే లేదు’’అని ట్విట్‌లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా స్పందిస్తూ.. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంపీల సస్పెన్షన్‌పై మరో ఎంపీ మనోజ్‌ ఝా స్పందిస్తూ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఈ సస్పెన్షన్‌ గురించి.. ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా విపక్ష నాయకుల్ని కోరాం. పరిష్కారం దొరక్కపోతే.. ఎంపీలందరితో కలిసి శీతాకాల సమావేశాల మొత్తం సెషన్‌ను బహిష్కరించడంపై ఆలోచిస్తాం’’అని తెలిపారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని