Karnataka: తండ్రీ కొడుకులిద్దరూ సీఎంలే.. అరుదైన జాబితాలోకి బొమ్మై ద్వయం

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బసవరాజ్‌ బొమ్మై ఓ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. ‘

Updated : 28 Jul 2021 13:01 IST

ముంబయి: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బసవరాజ్‌ బొమ్మై ఓ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. ‘సీఎం పీఠమెక్కిన తండ్రీ తనయుల ద్వయం’ జాబితాలో తన తండ్రితో కలిసి ఆయన చోటు సంపాదించన్నారు. బసవరాజు తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మై కూడా 1988-89 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేయడం గమనార్హం. వీరే కాదు.. ఇంకా పలు రాష్ట్రాల్లో చాలామంది తండ్రి-తనయుల జోడీలు సీఎం పీఠాన్ని అలంకరించాయి.  ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్న తండ్రి-కూతురు ద్వయంగా జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్, మెహబూబా ముఫ్తీ రికార్డు సృష్టించారు. మేఘాలయాలో గతంలో పీఏ సంగ్మా, ప్రస్తుతం ఆయన కుమారుడు కాన్రాడ్‌ సంగ్మా కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. జమ్ముకశ్మీర్‌లో ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌, కుమార్తె మెహబూబా ముఫ్తీ బాధ్యతలు నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని