Ts News: మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి.. కేంద్రంతో మేం పోరాడుతాం: కోమటిరెడ్డి

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి రైతులను మోసం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారా?అని సవాల్‌ విసిరారు. కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్రం కొనకపోతే...

Updated : 30 Nov 2021 12:56 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి రైతులను మోసం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారా?అని సవాల్‌ విసిరారు. కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.20వేల కోట్లు కేటాయించలేరా? అని నిలదీశారు.

‘‘తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి వచ్చాను అని చేప్పుకుంటారు కదా.. మరి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదు? తెలంగాణ అంటేనే పోరాటం.. మనం చేతులెత్తేయొద్దు. ఉత్తరాది రైతులు చేసిన విధంగా పోరాటం చేద్దాం. మూసీ పరివాహకం, సాగర్ ప్రాంతాలలో వరి తప్ప ఇంకేం పంటలు పండవు. మరి వారి పరిస్థితి ఏంటి..?మీ ఇష్టానికి కొనం అని ప్రకటనలు చేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలి? మీ ప్రకటనలతో రైతులు రోడ్లపైన పడతారు. ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనాల్సిందే. రాష్ట్రంలో 50 శాతం భూముల్లో వరి తప్ప ఇంకేం పండవు అని మీకు తెలుసు.  తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి ఏంటి? రైతులు రోడ్లపైన పడే పరిస్థితి కనిపిస్తుంటే.. రైతులు పక్క రాష్ట్రాల్లో భూములు కొంటున్నారని సీఎం అంటున్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్‌కి కనీస  అవగాహన లేదు. కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని వడ్లు కొనకుంటే ఊరుకునేది లేదు. సీఎం కేసీఆర్‌.. మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి. కేంద్రంతో మేం పోరాటం చేస్తాం’’ అని కోమటిరెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని