Lok Sabha: తెరాస ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ ఆగ్రహం.. సభ ఆరగంట వాయిదా

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై లోక్‌సభ స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలియజేయడం పట్ల స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు.

Updated : 01 Dec 2021 16:49 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై లోక్‌సభ స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలియజేయడం పట్ల స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పారు. అప్పటికీ తెరాస సభ్యులు శాంతించకపోవడం వల్ల లోక్‌సభను అరగంట పాటు వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల నుంచి తెరాస ఎంపీలు లోక్‌సభలో నిరసన గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళన నడుమ సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటంతో తెరాస సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వానాకాలం పంటను కొనాలి: ఉత్తమ్‌

యాసంగిలో పరి పంటపై ఆంక్షలు లేకుండా చూడటం సహా వానాకాలం పంటను త్వరగా కొనుగోలు చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లో ఉత్తమ్‌ మాట్లాడారు. వానాకాలం పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తెరాస ఎంపీలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వానాకాలం పంటను కొనిపించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని