Bypolls: కౌంటింగ్ పూర్తికాకముందే మమత ట్వీట్‌

కొద్దినెలల క్రితం పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసిన తృణమూల్ కాంగ్రెస్.. తాజాగా జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం దిశగా పయనిస్తోంది. నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విజయాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు. 

Published : 02 Nov 2021 15:58 IST

విద్వేష రాజకీయాలపై గెలుపంటూ వ్యాఖ్య..

కోల్‌కతా: కొద్దినెలల క్రితం పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసిన తృణమూల్ కాంగ్రెస్.. తాజాగా జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం దిశగా పయనిస్తోంది. నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విజయాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు అభ్యర్థులకు అభినందనలు! ఇది ప్రజల విజయం. అసత్య ప్రచారం, విద్వేష రాజకీయాల కంటే.. ఐక్యత, అభివృద్ధికే ఇక్కడి ప్రజలు ఓటేస్తారని మరోసారి నిరూపితమైంది. ప్రజల ఆశీర్వాదంతో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రక్రియను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను’ అని మమత అన్నారు. దిన్హాటా(Dinhata) నియోజకవర్గంలో భాజపాకు మంచిపట్టుంది. అయితే అక్కడ పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థి 91వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖార్డహా(khardah)లో భాజపా ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగతా రెండు స్థానాల్లోనూ వెనుకంజలోనే ఉంది. బెంగాల్‌లో తృణమూల్‌ గెలుపు తర్వాత భాజపా నుంచి వలసలు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని