Prashant Kishor: అదేం ఒక వ్యక్తికి సంక్రమించిన హక్కు కాదు.. రాహుల్‌పై కిశోర్ విమర్శలు..! 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇంటా, బయట విమర్శలు ఎక్కువవుతున్నాయి. నిన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించగా.. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు. గత పదేళ్ల  కాలంలో కాంగ్రెస్‌ 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదంటూ ట్వీట్ చేశారు.

Published : 02 Dec 2021 22:35 IST

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇంటా, బయట విమర్శలు ఎక్కువవుతున్నాయి. నిన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించగా.. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు. గత పదేళ్ల  కాలంలో కాంగ్రెస్‌ 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదంటూ ట్వీట్ చేశారు.

‘బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ కీలకమే. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వేళ.. ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే దైవిక హక్కు కాదు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందాం’ అంటూ రాహుల్ గాంధీ నాయకత్వంపై కిశోర్ పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని, కీలకంగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చినా.. పార్టీలో అంతర్గతంగా వచ్చిన వ్యతిరేకత వల్ల అది సాధ్యం కాలేదని తెలిసింది. గాంధీ కుటుంబంతో జరిపిన చర్చలు విఫలమైన దగ్గరి నుంచి ఆయన పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. లఖింపుర్ ఖేరీ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్పందనపై ప్రజలు అసంతృప్తికి గురయ్యారని, పార్టీలో నిర్మాణాత్మక సమస్యల వల్ల పరిష్కారాలు వెంటనే లభించడం లేదని గతంలో ట్వీట్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని