TS News: కేంద్రం జాతీయ ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి: తెరాస ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం జాతీయ ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు

Updated : 29 Nov 2021 16:39 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు వాయిదా పడిన అనంతరం తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

‘‘సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించాక మిగిలిన ధాన్యం ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. ఎఫ్‌సీఐ సేకరణతో రైతులకు భద్రత ఉంటుంది. కనీస మద్దతు ధర తక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు భర్తీ చేసింది. ఎప్పుడైనా ఖరీఫ్‌లో వచ్చే రా రైస్‌ ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. తెలంగాణలో వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. రాష్ట్రంలో 62లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రాష్ట్రంలో పండిన ధాన్యం తీసుకోవాలని కోరితే పట్టించుకోవట్లేదు. లక్షల ఎకరాల్లో ధాన్యం ఎలా పండిస్తారని కేంద్రం ప్రశ్నిస్తోంది’’ అని తెరాస ఎంపీలు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు