Updated : 26/09/2021 15:54 IST

UP Cabinet Expansion: ఎన్నికల వేళ.. యూపీ కేబినెట్‌ విస్తరణ..?

సిద్ధమైన యోగీ ఆదిత్యనాథ్‌ సర్కార్‌

లఖ్‌నవూ: పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయా రాష్ట్రాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కేబినెట్‌ విస్తరణకు సిద్ధమైంది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మధ్యే కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాదకు కేబినెట్‌లో స్థానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంగీత బింద్‌, ఛత్రపాల్‌ గంగ్వార్‌, దినేశ్‌ కార్తిక్‌, కృష్ణ పాసవాన్‌లకు కేబినెట్‌లో చోటు లభించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భాజపా.. అక్కడి పార్లమెంట్‌ స్థానాల్లోనూ భారీ మెజారిటీ సాధించింది. గత ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలుపొందింది. యూపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన భాజపా మొత్తం ఎంపీల్లో (లోక్‌సభ, రాజ్యసభ) 14 మంది కేంద్ర కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ సాధించిన (325 సీట్లు) భాజపా.. ఈసారి 350 స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మధ్యే జరిగిన పశ్చిమ బెంగాల్‌లో మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ.. తమిళనాడు, కేరళ ఫలితాలతో కాస్త నిరాశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికలను కీలకంగా భావిస్తోన్న భాజపా.. అన్ని వర్గాల వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే యూపీలో మరోసారి కేబినెట్‌ విస్తరణ చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొంటున్నారు.

కొలువుదీరనున్న పంజాబ్‌ మంత్రివర్గం..!

పంజాబ్‌లోనూ గతకొన్ని రోజులుగా రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పులు చెందుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లోనే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీఎం పదవికి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేబినెట్‌ కూర్పుపై ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన.. ఎట్టకేలకు మంత్రివర్గ జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ అధిష్ఠానంతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన అనంతరం శనివారం ఆయన పంజాబ్‌ చేరుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పంజాబ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని