IPL 2021: చెన్నైకి మద్దతిచ్చిన వార్నర్‌.. పోస్ట్‌ డిలీట్‌.. ఎందుకిలా చేశాడు?

మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ 2021 ప్రారంభం కానుంది. ఎలాగైనా టైటిల్‌ కైవసం చేసుకోవాలని చెన్నై సూపర్‌కింగ్స్‌ , కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండూ టీమ్స్‌ తుదిపోరుకు పోరుకు సిద్ధం కానున్నాయి. 

Published : 15 Oct 2021 19:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2021 ఫైనల్‌లో గెలిచి నాలుగోసారి టైటిల్‌ గెలవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌, రెండోసారి ధోనీసేనకు షాకివ్వాలని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు అభిమానులు సైతం తుదిపోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టగా ఈసారి ఫైనల్‌కు చేరడంతో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్టు చేసి.. వెంటనే దాన్ని డిలీట్‌ చేశాడు. అందులో వార్నర్‌ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని ఎల్లో జెర్సీ ధరించి చెన్నైకి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపాడు. అయితే, వెంటనే దాన్ని తొలగించడం గమనార్హం. కాసేపటికే మరోపోస్టు పెట్టిన అతడు.. ‘ఇందాక నేను చేసిన పోస్టుతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. వాళ్లందరికీ క్షమాపణలు. అందుకే అది డిలీట్‌ చేశాను. ఆ ఫొటోకి ఒరిజనల్‌ ఇదే’ అంటూ సన్‌రైజర్స్ జెర్సీలో తన కూతురుతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. అలాగే ఈరోజు ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్స్‌లో చెప్పాలని వార్నర్‌ తన అభిమానుల్ని కోరాడు. ఏదేమైనా ఈ ఆస్ట్రేలియా ఆటగాడు చెన్నైకి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని