T20 World Cup: టీమిండియాలో టాలెంట్‌కు కొదవలేదు.. కొంచెం పరిపక్వతతో ఆడితే చాలు: గంగూలీ

విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీ20 ప్రపంచ కప్‌ జట్టులో టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదని.. వాళ్లు కొంచెం పరిపక్వతతో ఆడితే ట్రోఫీ......

Published : 17 Oct 2021 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీ20 ప్రపంచ కప్‌ జట్టులో టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదని.. వాళ్లు కొంచెం పరిపక్వతతో ఆడితే ట్రోఫీ సాధించడం కష్టమేమి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. ఈసారి భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని తెలిపాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. అక్టోబరు 24న భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

‘ఛాంపియన్లుగా నిలవడమనేది మామూలు విషయం కాదు. ఆరంభ మ్యాచ్‌లో గెలిచినంత మాత్రాన కప్‌ సాధించినట్లు కాదు. సిరీస్ అసాంతం రాణించాలి. ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే కప్ మన సొంతమవుతుంది. అంతకంటే ముందు చాలా మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అందుకే, టైటిల్ గురించి ఆలోచించకుండా.. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే భారత్ దృష్టి పెట్టాలి. భారత జట్టులోని ప్రతి ఆటగాడిలో నైపుణ్యం ఉంది. వాళ్లందరూ పరుగులు చేయగలరు, అవసరమైనప్పుడు వికెట్లు కూడా తీయగలరు. అందుకే, ఫలితం గురించి ఆలోచించకుండా తాము చేసే పనిపైనే దృష్టి పెట్టాలి’ అని గంగూలీ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని