Updated : 07/12/2021 15:59 IST

beijing olympics: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తాం: ఐవోసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: బీజింగ్‌లో 2022న జరగాల్సిన వింటర్‌ ఒలింపిక్స్‌ను ‘దౌత్య బహిష్కరణ’ చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పేర్కొంది. ఒలింపిక్‌ సంఘ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనాలా.. వద్దా అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయం. అది ప్రభుత్వాల ఇష్టం. ఐవోసీ అనుసరించే రాజకీయ విధానం ఆధారంగా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అమెరికా ప్రభుత్వం ఒలింపిక్‌ గేమ్స్‌లో అథ్లెట్లు పాల్గొనే అంశంపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకొంది. మేము దానిని స్వాగతిస్తున్నాం.క్రీడలు, ఒలింపిక్స్‌ ద్వారా మెరుగైన ప్రపంచానికి నిర్మించాలనే తీర్మానాన్ని ఐరాసలో అందరూ ఆమోదించారు’’ అని పేర్కొన్నారు. 

క్రీడలకు సంబంధించి గత వారం ఐరాస జనరల్‌ అసెంబ్లీలో  ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 173 దేశాలు కోస్పాన్సర్‌ చేయగా.. 193 దేశాలు ఆమోదించాయి అని ఐవోసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.  వీఘర్‌ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ -2022కు ఇబ్బందికరంగా మారింది. జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు నిరసనగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని