Piyush Chawla: టీ20ల్లో పీయూష్‌ చావ్లా కొత్త రికార్డు..

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ పీయూష్ చావ్లా టీ20ల్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో ముంబయి ఇండియన్స్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా.. మహ్మద్‌

Updated : 10 Oct 2021 05:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ పీయూష్ చావ్లా టీ20ల్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో ముంబయి ఇండియన్స్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా.. మహ్మద్‌ నబీని ఔట్‌ చేశాడు. ఈ వికెట్ పడగొట్టడం ద్వారా  టీ20ల్లో అత్యధిక వికెట్లు (263) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (236  మ్యాచ్‌ల్లో 262 వికెట్లు) పేరిట ఉండేది.  పీయూష్ చావ్లా 249 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ని సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 166 వికెట్లతో మిశ్రా  రెండో స్థానంలో ఉండగా.. 157 వికెట్లతో చావ్లా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ కూడా ఓ కొత్త రికార్డును నమోదు చేశాడు. ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో నబీ ఐదు క్యాచ్‌లు ఒడిసిపట్టాడు. దీంతో ఐపీఎల్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించినా నెట్‌రన్‌రేట్‌ తక్కువ ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి చేరుకోలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని