IND vs NZ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో తొలి టెస్టు జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ అజింక్య రహానె తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు...

Updated : 25 Nov 2021 09:10 IST

కాన్పూర్‌: మరికాసేపట్లో కాన్పూర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ అజింక్య రహానె తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ చివరిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడగా అప్పుడు న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఇప్పుడు స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో కివీస్‌పై ఎలాగైనా గెలుపొంది ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రధాన ఆటగాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి ఎవరూ ఆడట్లేదు. దీంతో రహానె సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

భారత్‌: మయాంక్‌, శుభ్‌మన్‌, పుజారా, రహానె, శ్రేయస్‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌, ఇషాంత్‌, ఉమేశ్‌.

న్యూజిలాండ్‌: లేథమ్‌, విల్‌ యంగ్‌, విలియమ్సన్‌, టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, రాచిన్‌ రవీంద్ర, సౌథీ, అజాజ్‌ పటేల్‌, కైల్‌ జేమీసన్‌, సోమర్‌ విల్లే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని