IPL 2021: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ధోనీ మరోసారి ఎగిరి గంతేసేలా చేశాడు: కోహ్లీ

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గతరాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాటింగ్‌ చూసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సంబరపడ్డాడు...

Updated : 11 Oct 2021 12:58 IST

మాజీ సారథిపై ప్రశంసల జల్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గతరాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాటింగ్‌ చూసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సంబరపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి రెండు ఓవర్లలో ఒక సిక్సర్‌, మూడు ఫోర్లు బాది చెన్నైని ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో అతడి అభిమానులు, పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ధోనీని మునుపటిలా చూడటం బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ సారథి సైతం మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని మెచ్చుకున్నాడు.

ఎవరేమన్నారంటే..

* కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌. క్రికెట్‌లో అతిగొప్ప ఫినిషర్‌ అయిన ధోనీ నాకెంతో ఇష్టం. మరోసారి నన్ను కూర్చున్న సీట్‌లో నుంచి ఎగిరి గంతేసేలా చేశాడు. -విరాట్‌ కోహ్లీ

* ధోనీ బ్యాటింగ్‌ చూసి సంతోషంగా ఉంది. అతడెంతో అద్భుతంగా ఆడాడు. అతడి బ్యాటింగ్‌ గురించి అనేక మంది మాట్లాడారు. అతడికి ఏడో నంబర్‌ బాగా కలిసి వస్తుంది. ఈరోజు చాలా గొప్పగా ముగించాడు.  -మాథ్యూ హెడెన్‌

* జడేజా బాగా ఆడుతున్నా ఈసారి ధోనీనే ముందు బ్యాటింగ్‌కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్‌గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్‌గా పని పూర్తి చేశాడు.  -సునీల్‌ గావస్కర్

* వావ్‌.. ఈ మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా సాగింది. ఓటమిపాలైన దిల్లీ జట్టు ఇంకో మ్యాచ్‌లో గెలవాలని ఆశిస్తున్నా. ఇక ఇప్పుడు విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు అభినందనలు. కెప్టెన్‌ ధోనీ మరోసారి ఫినిషర్‌గా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే తన ఆటగాళ్లలో స్ఫూర్తి కలిగించాడు.   -ప్రీతి జింతా

* ఫినిషర్‌గా ధోనీది ఇదో కళాత్మక ప్రదర్శన. చాలా అద్భుతంగా ఆడాడు. అతడిలా మ్యాచ్‌లు ముగిస్తే ఎన్నో జ్ఞాపకాలు మన కళ్లముందు కదలాడుతాయి. - జైషా

* ఓం ఫినీషాయ నమహః! టైగర్‌ (ధోనీ) ఇంకా బతికే ఉంది. చెన్నై అద్భుత విజయం సాధించింది. రుతురాజ్‌ టాప్‌క్లాస్‌ బ్యాటింగ్‌కు తోడు ఉతప్ప క్లాసిక్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. ఇక ధోనీ ఎంత ముఖ్యమైన ఆటగాడో చూపించాడు. చెన్నైకి ఇది గొప్ప విజయం. గతేడాది ప్లేఆఫ్స్‌ కూడా చేరని ఆ జట్టు ఈసారి చెలరేగి ఆడింది. దీంతో మరోసారి ఫైనల్స్‌ చేరింది.   -వీరేంద్ర సెహ్వాగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని