David Warner: ఐపీఎల్‌ మెగా వేలంలో వార్నర్‌ కోసం ఎగబడతారు: గావస్కర్‌

టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన వార్నర్‌ కోసం ఐపీఎల్‌ మెగా వేలంలో జట్లు ఎగబడతాయని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 16 Nov 2021 09:42 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన వార్నర్‌ కోసం ఐపీఎల్‌ మెగా వేలంలో జట్లు ఎగబడతాయని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వేలంలో జట్లు ఎక్కువగా కోరుకునే ఆటగాళ్లు జాబితాలో అతను ముందు వరుసలో ఉంటాడని సన్నీ చెప్పాడు. సన్‌రైజర్స్‌కు అతను దూరం కాగా.. వచ్చే సీజన్‌ నుంచి లీగ్‌లో రెండు కొత్త జట్లు చేరుతుండడంతో త్వరలోనే మెగా వేలం జరగనుంది.

ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘‘వేలంలో కచ్చితంగా ఫ్రాంఛైజీలు కోరుకునే ఆటగాళ్లలో వార్నర్‌ ఉంటాడు. రెండు కొత్త జట్లు కూడా వేలంలో ఉంటాయని మర్చిపోవద్దు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంతో అనుభవమున్న అతను ఈ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు. రెండు కొత్త జట్లతో పాటు ఇతర ఫ్రాంఛైజీలు కూడా అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. ఎందుకంటే సన్‌రైజర్స్‌ అతణ్ని అట్టిపెట్టుకునేలా కనిపించడం లేదు. గత ఐపీఎల్‌ సందర్భంగా సాధారణ ఆటగాళ్లు కూడా జట్టుతో పాటు వచ్చినప్పుడు వార్నర్‌ను హోటల్‌కే పరిమితం చేయడం సరికాదు. అతని ఫామ్‌ కంటే కూడా ఇతర కారణాలేవో దాని వెనక ఉండొచ్చు. కానీ తనపై నమ్మకాన్ని కోల్పోని వార్నర్‌ సానుకూల దృక్పథంతో ప్రపంచకప్‌లో ఆడాడు. గతంలో జరిగింది మర్చిపోయి కేవలం భవిష్యత్‌ మీదే దృష్టి పెట్టాలని అతను అనుకుని ఉంటాడు’’ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని