Published : 24/11/2021 00:52 IST

ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనూ ట్విటర్‌ టిప్‌

ఓఎస్‌ పరికరాలకే పరిమితమైన ట్విటర్‌ టిప్‌ సదుపాయం ఇకపై ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇది కంటెంట్‌ క్రియేటర్లు, పాత్రికేయులతో పాటు ట్విటర్‌ వాడేవారు తమ ట్వీట్లను విక్రయించుకోవటానికి, టిప్స్‌ పొందటానికి వీలు కల్పిస్తుంది. దీని ద్వారా కంటెంట్‌ను సృష్టించినవారికి వినియోగదారులు తమకు తోచినంత డబ్బును బహుమతిగా పంపించుకోవచ్చు. క్రియేటర్లు తమ లింకులను బ్యాండ్‌క్యాంప్‌, క్యాష్‌ యాప్‌, పేట్రియాన్‌, పేపల్‌, విన్మో ఖాతాలకు షేర్‌ చేసుకోవచ్చు. వీటి ద్వారా అనుచరుల నుంచి డబ్బు రూపంలో టిప్స్‌ అందుకోవచ్చు. ఇందుకోసం ఎడిట్‌ ప్రొఫైల్‌ ద్వారా తమ ప్రొఫైల్‌కు టిప్స్‌ గుర్తును జోడించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కొంతమంది క్రియేటర్లు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. మున్ముందు ఎక్కువమందికి విస్తరించే అవకాశముంది. ట్విటర్‌ ఇటీవల ఐఓఎస్‌ పరికరాలు వాడేవారి (18 ఏళ్లు నిండిన) కోసం టిప్‌ జార్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీన్ని ఆండ్రాయిడ్‌ పరికరాలకూ విస్తరించటం ఆసక్తిని కలిగిస్తోంది. బిట్‌కాయిన్ల రూపంలోనూ టిప్స్‌ అందుకునేలా దీనికి మార్పులు చేయాలనీ భావిస్తోంది. అంతేకాదు.. ఫుల్‌ సైజు ఫొటోలకూ అనుమతించాలని ట్విటర్‌ అనుకుంటోంది. దీంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌లో ఆటో-క్రాపింగ్‌ ఆల్గోరిథమ్‌ రద్దవుతుంది. ట్విటర్‌ వినియోగదారులు తమ టైమ్‌లైన్‌లో పూర్తి స్థాయి దృశ్యాలను చూసుకోవటానికి వీలవుతుంది. ఫొటోలను పోస్ట్‌ చేసేటప్పుడే ప్రివ్యూలో అది ఎలా కనిపిస్తుందనేది చూసుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని