Updated : 10/11/2021 10:45 IST

Telegram: టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్లు.. ఏ ఫైల్‌ ఎప్పుడొచ్చిందో ఇట్టే తెలుసుకోవచ్చు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెలిగ్రామ్‌.. ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తోంది. తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వీటితో యూజర్స్‌ టెలిగ్రామ్‌ యాప్‌ను గతంలో కంటే మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మరి ఆ ఫీచర్లేంటి? అవి ఎలా ఉన్నాయో చూద్దాం..


హైస్పీడ్ స్క్రోలింగ్‌: చాలా మంది యూజర్స్‌ టెలిగ్రామ్‌ చాట్‌లో వచ్చే ఫైల్స్‌ను క్లౌడ్‌లో స్టోర్‌ చేసుకుంటారు. వాటిలో ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మ్యూజిక్‌ ఇలా ఎన్నో ఉంటాయి. తాజాగా వీటికి డేట్‌ బార్‌ అనే ఫీచర్‌ను యాడ్‌ చేసింది. దీని ద్వారా యూజర్‌ ఫైల్స్‌ ఏ తేదీన వచ్చాయనేది సులువుగా తెలుసుకోవచ్చు. అలానే ఫైల్స్‌ని పై నుంచి కిందకి వేగంగా స్క్రోల్ చేయొచ్చు. దానితోపాటు జూమ్‌ ఇన్‌ అండ్ ఔట్ ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు. దీంతో యూజర్‌కి రెండు థంబ్‌నెయిల్స్‌ కనిపిస్తాయి. వాటిని టచ్‌ చేస్తే ఆ ప్రాంతంలోని ఫొటోలు జూమ్‌ అవుతాయి. వాటిలో మీకు కావాల్సిన ఫొటోను సులువుగా గుర్తించవచ్చు. 


క్యాలెండర్‌ వ్యూ: ఈ ఫీచర్‌తో యూజర్స్‌ ఏ తేదీన ఏయే ఫైల్స్‌ వచ్చాయనేది తెలుస్తుంది. క్యాలండర్‌లో తేదీపైన క్లిక్‌ చేస్తే మీకు ఆ రోజు ఏమేం ఫొటోలు వచ్చాయనే జాబితా చూపిస్తుంది. అలానే ఇందులో ఫిల్టర్‌ షేర్‌ మీడియా అనే ఫీచర్‌ను యాడ్‌ చేశారు. దీని ద్వారా మనం షేర్‌ చేసిన ఫైల్స్‌లో కావాల్సిన వాటిని చూడొచ్చు. ఇందుకోసం యూజర్‌ ఏదైనా చాట్‌ పేజ్‌ ఓపెన్‌ చేసి అందులో కుడివైపు మూడు చుక్కలపైన క్లిక్ చేస్తే మీకు షో క్యాలండర్, షో ఫొటోస్‌, షో వీడియోస్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 


ఇన్వైట్ లింక్స్‌: ఇతర మెసేజింగ్ యాప్‌లలో గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే గ్రూప్‌ అడ్మిన్‌ జాయిన్ చేయడంతోపాటు ఇన్వైట్ లింక్‌, క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ వంటి ఫీచర్లున్నాయి. తాజాగా టెలిగ్రామ్‌లో కూడా ఇన్వైట్‌ లింక్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇక మీదట గ్రూప్‌లో జాయిన్‌ కావాలనుకునే వారికి ఇన్వైట్ లింక్‌ షేర్‌ చేయాలి. వాళ్లు లింక్‌పై క్లిక్‌ చేసి జాయిన్‌ రిక్వెస్ట్ చేయగానే గ్రూప్‌ అడ్మిన్‌కు తెలుస్తుంది. తర్వాత అడ్మిన్‌ సదరు వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్‌.. తదితర వివరాలు చూసి దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది.  


గ్లోబల్‌ చాట్ థీమ్స్‌: వీటితోపాటు ఐఓఎస్‌ యూజర్స్‌ గ్లోబల్‌ చాట్‌ థీమ్స్ పేరుతో కొత్త థీమ్స్‌ని తీసుకొచ్చారు. వీటితో యూజర్స్‌ తమ చాట్ పేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. అలానే వీటిలో డే, నైట్‌ మోడ్‌లు కూడా ఇస్తున్నారు. యూజర్స్‌ ఈ చాట్‌ థీమ్స్‌ని తమకు నచ్చినట్లుగా రీడిజైన్‌ చేసి ఇతరులతో షేర్ చేయొచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని