ట్విటర్‌ ఖాతా లేకున్నా ‘స్పేసెస్‌’లో వినొచ్చు..!

ఇటీవల ట్విటర్‌ ఆడియో చాట్‌రూమ్‌ ‘స్పేసెస్‌’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో మార్పులు చేస్తూ తాజాగా కొత్త

Published : 10 Nov 2021 09:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ట్విటర్‌ ఆడియో చాట్‌రూమ్‌ ‘స్పేసెస్‌’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో మార్పులు చేస్తూ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ చాట్‌రూమ్‌లో జరిగిన సంభాషణలను ఇక ఖాతా లేకుండా వినేలా వెసులుబాటు తెచ్చింది. దీంతో వినియోగదారులు తమ స్పేసెస్‌ లింక్‌లను నేరుగా ఇతరులతో పంచుకోవచ్చు. ట్విటర్‌లోకి లాగిన్ అవ్వకుండానే వెబ్ ద్వారా ఆడియో సెషన్‌కు హాజరు కావచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో ట్విటర్‌ ఖాతా లేనివారు కూడా స్పేసెస్‌లో ఆడియోను యాక్సెస్ చేయగలరు. కానీ, చాట్‌రూమ్‌లో మాత్రం పాల్గొనలేరు. ఈ విషయాన్ని స్పేసెస్ టీమ్‌ ట్విట్‌ ద్వారా వెల్లడించింది. ‘‘ఇక స్పేసెస్‌లో ఆడియో ప్రసారాన్ని ఇతరులకు నేరుగా లింక్‌ పంపించి వారినీ చాట్‌రూమ్‌లో చేర్చుకోవచ్చు. ట్విటర్‌లో ఖాతా లేని వారు కూడా వెబ్ వెర్షన్‌లో ఆడియో వినొచ్చు’’అని పేర్కొంది.

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ క్లబ్‌హౌస్, ఫేస్‌బుక్‌ లైవ్ ఆడియో చాట్‌రూమ్‌లాగే ‘స్పేసెస్‌’ పనిచేస్తోంది. దీన్ని 2020 చివరిలో ప్రారంభించింది. అప్పుడు 600 కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్న ఖాతాదారులు మాత్రమే స్పేసెస్‌ను హోస్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఫాలోవర్స్‌ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పబ్లిక్, ప్రైవేట్ ఆడియో చాట్ రూమ్‌లను క్రియేట్‌ చేసుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. అలాగే ఒక్క చాట్‌రూమ్‌లో ఒకేసారి 11మంది స్పీకర్లు పాల్గొనేలా మార్పులు తెచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని