హార్దిక్ పాండ్యను ట్రోల్ చేయొద్దు: సౌరభ్ గంగూలీ
ముంబయి కెప్టెన్సీ మార్పు అంశంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్, దిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. కెప్టెన్సీ విషయంలో అభిమానులు హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను ట్రోల్ చేయొద్దని, అలా చేయడం సరికాదని దాదా సూచించాడు.