close

Published : 29/12/2020 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్నేహితుడితో పాట పాడుతుంటే..జుట్టుకు నిప్పు

 

లండన్‌: క్రిస్మస్ వేడుకల్లో సరదాగా గడుపుతూ..స్నేహితుడితో పాటలు పాడుతోన్న ఓ యువతికి అవాంతరం ఎదురైంది. పండుగ సమయంలో వెలిగించిన కొవ్వొత్తుల కారణంగా ఆమె జుట్టుకు నిప్పంటుకుంది. సదరు యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే...

సోఫియా ఎల్లార్‌ అనే బ్రిటిష్ గాయని క్రిస్మస్ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించుకుంది. క్రిస్మస్ ట్రీ ముందు కూర్చొని తన స్నేహితుడితో పాటలు పాడుతూ, సరదాగా గడిపేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె వెనక్కి వంగగా..వెనకే ఉన్న కొవ్వొత్తుల మంట జుట్టుకు అంటేసుకుంది. పండుగ మూడ్‌లో ఉన్న ఆమెకు కొద్ది సేపటికిగానీ విషయం అర్థం కాలేదు. అయితే వెంటనే స్పందించిన ఆమె స్నేహితుడు మంటలార్పేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల సోఫియానే ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయగా..విపరీతంగా చక్కర్లు కొట్టింది. సుమారు ఐదు లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది కానీ, భయమేసిందని నెటిజన్లు స్పందించారు.  

ఇవీ చదవండి:

2020:జంతు ప్రపంచపు‘సిత్రాలు’

జనాలకి చుక్కలు చూపించిన ఆ ఐదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు