
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా అడవికి రారాజు సింహం అంటారు. అడవిలో ఏ జంతువునైనా సింహం తన పంజా, గర్జనతో భయపెడుతుంది. కావున దానితో పోరాడటం ఏ జంతువు వల్ల కాదు.. కానీ ఇక్కడ ఓ వీధి శునకం ఆడ సింహంతో పోరాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో ఆడ సింహం తరుముతున్నా.. ఆ శునకం వెనుదిరిగి సింహంతో పోరాడుతున్న దృశ్యాన్ని పర్యాటకులు కొద్ది దూరంలోని జీపులో నుంచి వీక్షిస్తున్నారు.
కుక్కను ఆడసింహం కొంత దూరం తరముకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కుక్క ఆగి వెనక్కి తిరిగి సింహంపై ఎదురుదాడికి దిగింది. గట్టిగా మొరుగుతూ.. ఒక పెద్ద పిల్లితో పోరాడినట్లుగా సింహాన్ని వెనక్కి తరిమింది. దీంతో సింహం వెనకడుగు వేసింది. అనంతరం శునకం అక్కడి నుంచి పరుగెత్తింది. వీధి కుక్క సింహంతో పోరాడటం గొప్ప విషయం. జీవితంలో ఈ విధమైన నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది అని కాస్వాన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు 1.6 లక్షల వీక్షణలు వచ్చాయి. ప్రకృతి చరిత్రలో ఇది ఒక క్రేజీ సందర్భం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి..
కొండదారిలో బస్సు డ్రైవర్ గుండె ధైర్యం!
రూ. లక్షసంచితో కోతి పరార్.. వృద్ధుడి తిప్పలు
మరిన్ని
దేవతార్చన
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- రూ. 47వేలకు చేరిన బంగారం
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
- టీకా వేయించుకున్న నటాషా పూనావాలా
- హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత