
ఇంటర్నెట్ డెస్క్: సమయస్ఫూర్తితో స్పందించే లక్షణం ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. అలానే ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేయవచ్చు. సముద్రంలో సర్ఫింగ్ ఎంత సరదాగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా.. అయితే చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకే వచ్చేస్తుంది. అలాంటి ప్రమాదం నుంచి తనదైన సాహసోపేతమైన సమయస్ఫూర్తితో ఓ మహిళను కాపాడాడు మైకీ రైట్.
ఆస్ట్రేలియన్ సర్ఫర్ అయిన మైకీ రైట్ సముద్ర తీరంలో సేదదీరుతుండగా ఓ మహిళ సముద్రపు అలల దెబ్బకు కొట్టుకుపోవడం గమనించాడు. దీంతో ఒక్కసారిగా చురుగ్గా కదిలి మెరుపు వేగంతో ఆ మహిళను రక్షించిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్‌గా మారింది. నాలుగు రోజుల కిందట సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోకు దాదాపు 2.70 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. తమదైన కామెంట్లతో నెటిజన్లు మైకీ రైట్ను అభినందించారు. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి..
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..!
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత