
2020..కరోనా వైరస్‌తో ప్రారంభమైంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం..అంటూ ఇలా రొటీన్‌గా గడుస్తుండగా, మధ్యమధ్యలో ఊరటనిచ్చే టీకా కబుర్లు. శాస్త్రవేత్తల కృషి, మన ప్రార్థనలు ఫలించి టీకా వచ్చిందిలే అని అలా మాస్క్ తీసి సంతోషపడదాం అనుకున్నాం. అంతే, యూకే, దక్షిణాఫ్రికాలోని కరోనా కొంచెం మేకప్ కొట్టుకొని..సరికొత్తగా దర్శనమిచ్చింది. ఇలా ఇన్ని వార్తలు చూశాకా మన నెటిజన్లు ఊరుకుంటారా! తమ వాక్చాతుర్యాన్ని పూర్తిగా దట్టించి మీమ్స్ చేసి, తెగ నవ్వించారు. అవేంటో మరోసారి మనమూ చూద్దామా...
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విజృంభణను మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైరస్ ప్రారంభ దశలో ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో ప్రజలంతా కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితయ్యారు. దాంతో వచ్చిన వర్క్‌ఫ్రమ్ హోం కష్టాలు, ఎప్పుడు గరిటె పట్టని వారి పాకశాస్త్ర ప్రతిభ, చివరగా ఔషధ సంస్థల టీకా రేసు వంటి అంశాలపై మీమ్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే జనతా కర్ఫ్యూ సందర్భంగా దీపాలు వెలిగించడంపై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంది.
♦ పబ్జీ ఆటను నిషేధించినప్పుడు..ఆ ఆన్లైన్ గేమ్ ప్రియులు ఎంతగా బాధపడ్డారో తెలిసిందే. ఆ వెంటనే దానిపై బాలీవుడ్ నటుడు ఫాగ్-జీ పేరుతో అదే తరహా గేమ్‌ను తీసుకువస్తారనగానే నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
♦ ఇక ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా కాస్త భిన్నంగానే ఉంటుంది. అదే తీరును తన కుమారుడు పేరులో చూపించడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టారు. రోమన్ లెటర్స్, అంకెలతో..ఆయనే గుర్తు పెట్టుకోలేని పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపర్చారు.
♦ ఘనాకు చెందిన కొందరు వ్యక్తులు శవపేటికను మోస్తూ చేసిన నృత్యం, నెట్టింట్లో ఈ ఏడాది విపరీత ఆదరణను సొంతం చేసుకుంది.
♦ అలాగే 2020 తమ ప్రణాళికలను చెల్లాచెదురు చేయడాన్ని, లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉండటంతో కాలుష్యం తగ్గడంపైనా వచ్చిన మీమ్స్ మెప్పించాయి. అంతేకాకుండా పలు దేశాల్లో దర్శనమిచ్చిన ఏకశిలపైనా కౌంటర్లు వచ్చాయి.
ఇవీ చదవండి.. స్నేహితుడితో పాట పాడుతుంటే..జుట్టుకు నిప్పు
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా